Thursday, January 23, 2025

శిల్పారామం సమీపంలో మహిళా స్టాల్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన శిల్పారామం పక్కన నిరుపయోగంగా ఉన్న స్టాల్స్ ను పరిశీలించారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్ లోని 119 స్టాల్స్ ను ఇందుకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు బజార్ లా స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేలా స్టాల్స్ ను తీర్చి దిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు.

పూర్తిగా మహిళలకు మాత్రమే స్టాల్స్ ను కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా ఉత్తర్వులను జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆదేశించారు. అవసరమైతే మణిపూర్ లోని మహిళలకు కేటాయించిన మార్కెట్ ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

Revanth-Mahila-2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News