Monday, December 23, 2024

తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల దత్తత : షిండే ప్రభుత్వ నిర్ణయం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా కొండ ప్రాంతమైన ఇర్షల్ వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగి పడి భారీగా ప్రాణ నష్టం జరిగింది. వీరిలో 80 మందికి పైగా ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కొండచరియల కింద ఎంతమంది ఉన్నారో సరిగ్గా తెలియడం లేదు. కొండచరియల కారణంగా కూలిన ఇళ్ల శిధిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారు బతికే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ప్రమాదం నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆయన దత్తత తీసుకోనున్నారని శివసేన పార్టీ వెల్లడించింది. రెండు నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న చిన్నారులను శ్రీకాంత్ షిండే ఫౌండేషన్ కింద ఆశ్రయం పొందుతారని చెప్పారు. ఆ ఫౌండేషన్ వారికి సంబంధించిన అన్ని ఖర్చులను భరిస్తుంది అని శివసేన తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News