Thursday, December 12, 2024

హేమంత్ సోరెన్ క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ 14 వ ముఖ్యమంత్రిగా జేఎమ్‌ఎమ్ నేత హేమంత్ సోరెన్ గత వారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా 11 మందికి చోటు కల్పించారు. వారంతా గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేఎమ్‌ఎమ్ ఎమ్‌ఎల్‌ఎలు దీపక్ బిరువా, చమ్రలిండా, రాందాస్ సోరెన్, హఫీజుల్ హసన్, కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎలు రాధాకృష్ణ కిషోర్, ఇర్ఫాన్ అన్సారీ, ఆర్జేడీ ఎమ్‌ఎల్‌ఎ సంజయ్ ప్రసాద్ యాదవ్ తదితరులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులచే గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణ స్వీకారం చేయించారు.అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు జెఎంఎం కూటమికి 56 , ఎన్‌డిఎ కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.రాష్ట్ర 14 వ ముఖ్యమంత్రిగా జెఎంఎం చీఫ్ హేమంత్ సోరేన్ గత నెల 28న ప్రమాణ స్వీకారం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News