Monday, December 23, 2024

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వైఎస్ జగన్ సవాల్…

- Advertisement -
- Advertisement -

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం రైతు భరోసా పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. సభలో ప్రసంగించిన సీఎం జగన్, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏనాడూ మేలు చేయలేదని ఆరోపించారు.

వైఎస్ జగన్ తన ప్రభుత్వ పనులపై విశ్వాసం వ్యక్తం చేస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తాము ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉందని, మొత్తం 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రజలకు మేలు చేశామని నమ్ముతున్నానన్నారు. అందుకే ప్రజలు తనను మరోసారి ఎన్నుకుంటారన్న నమ్మకం ఉందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News