Monday, December 23, 2024

నీ చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతావా? జగన్: బీటెక్ రవి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే సిఎం జగన్ మోహన్ రెడ్డి అని టిడిపి నేత బీటెక్ రవి విమర్శించారు. శుక్రవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు రూ.750 కోట్లు జగన్ పెట్టారని, ఆయనపై పోటీ చేస్తున్న తన అఫిడవిట్‌లో రూ.80 లక్షల్లోనే ఉందని, అఫిడవిట్‌ను చూసైనా పేదవాడెవరు, పెత్తందారు ఎవరో ప్రజలు చూశారని, ఎన్నికల అఫిడవిట్ చూసి జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆఖరికి జగన్ ఆయన చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతున్నారంటే ఏమనాలని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకులైన వారితో మద్దతుగా ఉంటారా? అని జగన్‌ను రవి విమర్శించారు. ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News