Monday, December 23, 2024

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన సిఎం జగన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల సిఎం జగన్ సంతాపం తెలిపారు.  జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 46లోని మంత్రి గౌతవ్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన భౌతికగాయానికి జగన్ నివాళులర్పించి, పుష్పాంజ‌లి ఘ‌టించారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కాగా, రేపు ఉదయం ఎయిర్ అంబులెన్స్ లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఎపికి తరలించనున్నారు. నెల్లూరులో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఎల్లుండి ఉదయం నెల్లూరు నుంచి బ్రాహ్మణపల్లికి అంతిమయాత్ర నిర్వహించి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సిఎం జగన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

CM Jagan Condolences to demise of Goutham Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News