- Advertisement -
హైదరాబాద్: సిఆర్‌డిఎ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లు ప్రస్తుతానికి రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వికేంద్రీకరణపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణపై సిఎం జగన్ మాట్లాడారు. ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని, మూడు రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని, పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెడుతామని తెలియజేశారు. కొత్త బిల్లుపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామని జగన్ వివరించారు. ఎపి విస్తృత, విశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సిఎం ప్రకటన తరువాత అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.
- Advertisement -