Monday, January 20, 2025

చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ లపై సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: తెలుగు దేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వెంకటగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సిఎం జగన్ మాట్లాడుతూ.. ”లోకేష్ పట్టపగలు మందు తాగుతూ, స్విమ్మింగ్ పూల్ పక్కనే అమ్మాయిలతో డాన్సులు చేస్తుంటాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అని బాలకృష్ణ అంటాడు. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి కానీ సిగ్గు లేదు. బావా నువ్వు సినిమాల్లోనే చేశావు కానీ నేను నిజ జీవితంలో చేశాను అంటాడు.పవన్ కళ్యాణ్ అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు.

వాలంటీర్లంతా మన ఊరి పిల్లలు, మన ఇరుగుపొరు పిల్లలు. ఉదయాన్నే చిరునవ్వుతో మీ తలుపుతట్టి మీ మంచి చెడులు అడుగుతారు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వాలంటీర్లు. ఇలాంటి వారిపై తప్పుడు మాటలు మాట్లాడుతున్న దత్తపుత్రుడికి స్క్రిప్ట్ ఇస్తున్నది రామోజీ అయితే.. నిర్మాత చంద్రబాబు” అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News