- Advertisement -
అమరావతి: విశాఖపట్నంలో జగన జాగరణ సమితి ఫ్లెక్సీల కలకలం సృష్టించాయి. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా నగరంలో వినూత్న ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. విశాఖ వాసులు ఫ్లెక్సీలను ఆసక్తిగా చూస్తున్నారు. సిఎం జగన్ బుధవారం భోగాపురం, విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, ఐటీ హిల్స్ అదాని డేటా సెంటర్‌కు సిఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల పేరిట సిఎం జగన్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఎపి రాజధాని అంటే ఏ పేరు చెప్పాలో అర్ధం కావడం లేదని ఆంధ్ర ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఎన్‌టిఆర్ జిల్లాలో అప్పుడు తండ్రిని… ఇప్పుడు తల్లిని చంపాడు…
- Advertisement -