Sunday, December 22, 2024

జగన్ తో బైరెడ్డి, బాలినేని భేటీ… ఆ నేతలకు భయం పట్టుకుంది..

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పింఛన్ల పంపిణీకి మంత్రి నాగార్జున, ఎంఎల్‌ఎ సుధాకర్ బాబు హాజరుకాలేదు. బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి జగన్ భేటీ దృష్ట్యా మంత్రి నాగార్జున పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం. సీట్ల సర్దుబాటు, అసమ్మతి నేతలపై చర్చించేందుకు సిఎంతో బాలినేని భేటీ కానున్నారు.

నందికొట్కూరు వైసిపి ఇన్‌ఛార్జి మార్పుపై కూడా సిఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించనున్నారు. నందికొట్కూరు ప్రస్తుత ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సిఎం ఆఫీస్ నుంచి పిలుపు రావడంతో క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు ఎంఎల్‌ఎ ఆర్ధర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్‌సి స్థానమైన నందికొట్కూరుకు కొత్త అభ్యర్థి ఎంపికపై సిఎం చర్చ చేయనున్నారు. ఎంఎల్ఎ ఆర్ధర్ కు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎల్ఎ సీటు నిరాకరించినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News