- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో 19వ రోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. శనివారం ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుందని పార్టీ నేతలు తెలిపారు. నక్కపల్లి, పులవర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత నరిసింగపల్లి మీదుగా చింతపాలెంకు బస్సుయాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చింతలపాలెం దగ్గర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం వరకు బస్సుయాత్ర చేరుకోనుంది. రాత్రి చిన్నయపాలెంలో ముఖ్యమంత్రి జగన్ బస చేయనున్నారు.
- Advertisement -