Wednesday, January 22, 2025

మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్: చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను సిఎంగా ఉన్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చానని టిడిసి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మట్టి, ఆస్తులు కొట్టేసిన ఘనుడు సిఎం జగన్ అని విమర్శించారు. ఉండి ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు చాలా దుర్మార్గమైందని, భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని, మద్యంతోనే వేలాది కోట్ల రూపాయలు దోచేశారని, మద్యపానం రద్దు చేశాకే ఓట్లు అడుగుతానని జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. మీ భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారని, ఫ్యానుకు, వైఎస్‌ఆర్‌సిపికి ఉరేయాలని పిలుపునిచ్చారు. న్యాయానికి, అన్యాయానికి జరిగే ఎన్నికలు ఇవి అని, కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది అని, రామరాజు సేవలు రాష్ట్రానికి అవసరమని తెలియజేశారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారి, సైకో, బందిపోటు జగన్ అని మండిపడ్డారు. ఎపి ప్రభుత్వాన్ని ఆర్‌ఆర్‌ఆర్ ప్రశ్నించినందుకు హింసించారని, ఆర్‌ఆర్‌ఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News