Tuesday, November 5, 2024

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తేనే పేదరికం దూరం: సిఎం జగన్‌

- Advertisement -
- Advertisement -

CM Jagan Mohan Reddy Started ATC Tires Industry

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించినప్పుడే పేదరికం నుంచి బయటపడటంతో పాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సిఎం జగన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఏటీసీ టైర్ల పరిశ్రమను జగన్‌ మంగళవారం ప్రారంభించారు. పరిశ్రమ మరో యూనిట్ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ ప్రసంగిస్తూ…. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా అవార్డు తీసుకుంటున్నామన్నారు. జపాన్‌ కంపెనీకి ప్రపంచంలోనే ఐదో స్థానం ఉందని చెప్పారు. అలాంటిది 15 నెలల్లోనే ఏటీసీ టైర్ల పరిశ్రమను స్థాపించగలిగామని సగర్వంగా జగన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 2023 నాటికి రెండో పనులు పూర్తి చేసే అవకాశం ఉందన్న సిఎం ఒక ప్రాంతం అభివృద్ధికి మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలి అని అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.

ఈ మూడేళ్లలో ఆంధ్రప్రవేశ్ కి 17 భారీ పరిశ్రమల ద్వారా 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వచ్చే రెండేళ్లలో మరో 56 పెద్ద కంపెనీలు రానున్నాయని చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రంగంలోనూ 31,671 పరిశ్రమలు రూ.8,285 కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. మూతపడ్డ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు చేయూతనిస్తున్నట్లు, రూ.1,463 కోట్లతో ఎంఎస్‌ఎంఈల పునరుద్ధరణకు ప్రోత్సాహకాలు ఇచ్చిన విషయాన్ని సిఎం జగన్‌ గుర్తుచేశారు. గతంలో అదానీ సంస్థ పేరు మాత్రం చెప్పుకునే వాళ్లు. కానీ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అదానీ అడుగులు ఏపీలో పడ్డాయని, అదానీ, అంబానీ లాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని వివరించారు. విశాఖలో రెండు నెలల్లో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుతో పాటు 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్‌ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు లక్ష వరకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని 9 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయన్న విషయాన్ని తెలియజేశారు. మూడు ఇండస్ట్రీయల్‌ కారిడార్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News