Wednesday, January 22, 2025

దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

కోనసీమ: దేశ చరిత్రలోనే సున్నా వడ్డీ లాంటి పథకం ఎపిలో తప్ప ఏ రాష్ట్రంలో లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమంలో సిఎం జగన్ పాల్గొని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో 4వ విడత సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేశారు. మొత్తం 9.48 లక్షల డ్వాక్రా గ్రూపు ఖాతాల్లో రూ.1358.78 కోట్లను సిఎం జగన్ జమ చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. “2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. సున్నా వడ్డీ పథకాన్ని 2016లో చంద్రబాబు రద్దు చేశారు.

మన ప్రభుత్వం రాగానే మళ్లీ అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడింది. మహిళలు.. వారి కాళ్ల మీద వారు నిలబడాలని సున్నా వడ్డీ పథకం తీసుకొచ్చాం. ఈ నాలుగున్నరేళ్లలో మహిళ పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. కోటి 5 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీ నిధులు విడుదల చేస్తున్నాం. సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.4 వేల 9 వందల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశాం. దేవుడి దయతో మంచి కార్యక్రమం చేస్తున్నాం. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.14 వేల 129 కోట్లు అందించాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేయలేదు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మూడు విడతల్లో 19 వేల కోట్లకుపైగా అక్కాచెల్లెమ్మల చేతిలో పెట్టాం” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News