- Advertisement -
అమరావతి: ఎపిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ముంపు ప్రాంతాల వారిని ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. బాధితుల కోసం ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులకు మంచి నీరు, ఆహారం అందించండంతోపాటు తక్షణ సాయంగా రూ.వెయ్యి చొప్పున అందించాలని సిఎం జగన్ అదేశించారు.
CM Jagan Review Meeting on Heavy Rains
- Advertisement -