Wednesday, January 22, 2025

వైద్య ఆరోగ్య శాఖపై సిఎం జగన్ సమీక్ష.. ప్రతిచోటా ఫిర్యాదుకు ఫోన్‌ నంబర్లు

- Advertisement -
- Advertisement -

తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదని సిఎం పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి ప్రతిచోటా ఫోన్ నంబర్ ఉండాలని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కన్సెప్ట్ ను సమర్థవంతంగా అమలు చేయాలని హెచ్చరించారు. పిహెచ్ సిలు, విలేజ్ క్లినిక్స్ పనితీరు మెరుగ్గా ఉండాలని అధికారులను ఆదేశించారు.

విలేజ్ క్లినిక్ స్థాయిలో కంటి పరీక్షలు కూడా నిర్వహించాలన్నారు. రిక్రూట్ మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని సిఎం జగన్ పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదని సిఎం వెల్లడించారు. ఒక ఐఎఎస్ నేతృత్వంలో ఎప్పటికప్పడు ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులపై చర్చించారు. చరిత్రలో నిలిచేలా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News