Tuesday, November 5, 2024

ఎపి నుంచి ఒక ఐపిఎల్ టీం…

- Advertisement -
- Advertisement -

తాడేపల్లి: క్రీడలు-యువజన సర్వీసుల శాఖపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఎపి రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించనున్నారు. గ్రామ/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు పెట్టనున్నారు. బాలబాలికలకు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నికాయిట్ సహా సంప్రదాయ పోటీసులు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 రోజులపాటు ఆటల పోటీలు జరగనున్నాయి. ఏటా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆటల పోటీలు నిర్వహించాలని సిఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్రికెట్ పోటీలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.

భవిష్యత్ లో ముంబై ఇండియన్స్ సహాయం కూడా తీసుకుంటామన్నారు. సిఎస్ కేకు 3 క్రికెట్ మైదానా్లో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తామని సిఎం వెల్లడించారు. భవిష్యత్ లో ఎపి నుంచి ఒక ఐపిఎల్ టీం దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు. అంబటి, కేఎస్ భరత్ లాంటివాళ్లు రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోటీల కోసం ప్రతి మండలంలోనూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. ఆటల్లో విజేతలకు బహుమతులతో పాటు క్రీడా సామగ్రి అందించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News