హైదరాబాద్: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై క్యాంప్ కార్యాలయంలో సిఎం వైయస్ జగన్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, గృహనిర్మాణాశాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ (సర్వే, సెటిల్‌మెంట్స్) సిద్దార్ధ జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం ఎం నాయక్, ఎపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఎపిఎండిసి విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.