Monday, December 23, 2024

ప్రజలకు సిఎం గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై అధికారులతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సిఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ 18న సీఎం వైఎస్‌ జగన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇది చరిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలని పేర్కొన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామని తెలిపిన జగన్ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో  వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం టి కృష్ణబాబు, ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News