- Advertisement -
హైదరాబాద్: కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి సైతం విచారణకు హజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. విజయవాడలోని ఎన్‌ఐఎ కోర్టు ఈ కేసును మంగళవారం విచారించింది. కోడికత్తి కేసులో నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ విచారణకు హాజరవ్వగా, ఆయన తరపున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు.
కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ దినేష్ కుమార్ విచారణకు హజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ట్రయిల్ షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించాలని, అందులో బాధితుడి జగన్ షెడ్యూల్ కుడా ఉండాలని అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తూ ఆరోజు విచారణకు సిఎం జగన్ రావాలని ఆదేశాల్లో కోర్టు పేర్కొంది.
- Advertisement -