Saturday, November 23, 2024

చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలే: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం రూ.5.41 కోట్లతో ఆధునీకరించిన ప్రాంతీయ ఆస్పత్రి, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడంతోపాటు మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. “చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలే. రెచ్చగొట్టి గొడవలు పెట్టి శవరాజకీయాలు చేయాలనేదే వీరి ఉద్దేశం. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. కావాలనే అంగళ్లులో పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసుల మీద కర్రలు, బీరు బాటిళ్లతో దాడి చేశారు. ఓ పోలీస్‌ కన్ను కూడా పోగొట్టారు. చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వీళ్లే ఆయన ఫోటోకు దండం పెడతారు. ఎన్టీఆర్‌ పేరుతో నాణెం విడుదల చేస్తే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాల్గొన్నారు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News