అమరావతి: రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం రూ.64,720కోట్లు చేశామని, బట్టన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయులకు ఈ విషయం చెప్పండని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.బుదవారం పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంనులో ఏర్పాటు చేసి వేదిక మీదనుంచి సిఎం జగన్ బటన్ నొక్కి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..”గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని క్షమించగలమా?, పెత్తందారులకే అందుబాటులో ఉన్న చదువులు.. ఇప్పుడు పేద పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. పదిరోజుల పాటు పండగలా జగనన్న అమ్మ ఒడి నిర్వహించి.. 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 6,392 కోట్లు జమా చేశాం. మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్‌గా తయారు కావాలి. క్లాస్ టీచర్లకే గతిలేని పరిస్థితిని గతంలో చూశాం. ఇప్పుడు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు ఉండేలా చేస్తున్నాం.
మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్ట్ బుక్స్ తీసుకువచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ కరికులమ్ తీసుకొస్తాం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేశాం. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి నుంచే ట్యాబ్స్ అందిస్తున్నాం. వంద శాతం పూర్తి ఫీజు రిఎంబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నాం. ప్రపంచంలోని టాప్-50 కాలేజీల్లో సీటు వస్తే రూ.కోటి 25 లక్షలు ఇస్తున్నాం” అని చెప్పారు.
Also Read: రూ.6వేల కోట్ల జగనన్న అమ్మఒడి నిధులు విడుదల..