తన పాదయాత్రలో చూసిన సమస్యలకు పరిష్కారంగా ఈ ఐదేళ్ల పాలన కొనసాగిందని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేసి తీరు.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్ తన పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. గత ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు కావాల్సిన గుర్తింపు వచ్చిందన్నారు. మేనిఫెస్టో అంటే తమకు పవిత్రమైన గ్రంథం అని చెప్పారు. మేనిఫెస్టోను భగద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించామని అన్నారు. 2019 మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు.
లంచాలు, అవినీతికి తావు లేకుండా రూ.2లక్షల 70వేల కోట్లను డిబిటి ద్వారా అందించామని చెప్పారు. ఈ 58 నెల్లలో సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేశామన్నారు. ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తామో చెప్పి.. అమలు చేశామన్నారు.
నాయకుడు ఇచ్చిన మాటలను నమ్మి ప్రజలు ఓటు వేస్తారు.. ఆ నమ్మకాన్ని నాయకుడు నిలబెట్టుకోవాలని ఆయన చెప్పారు. హామీలు అమలు చేసినా.. చేయకున్నా.. చంద్రబాబులా హామీలు ఇచ్చేదామని తనకు చాలా మంది చెప్పారని.. కానీ, సాధ్యమయ్యే హామీలే ఇచ్చి.. వాటిని అమలు చేసి.. ఒక హీరోలా ప్రజల్లోకి వెళ్తున్నామని సిఎం జగన్ అన్నారు.