Wednesday, January 22, 2025

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని: సిఎం జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తిని నేనని ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎపిఎన్జీఓ అసోసియేషన్ 21వ రాష్ట్ర మహా సభలకు ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రసంగించారు. “గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసింది. గత ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను పరిష్కరించాం. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం విస్తరించింది. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాం.జిపిఎస్ పై రేపో మాపో జీవో వస్తుంది.

దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే జిపిఎస్ తీసుకొచ్చాం. జిపిఎస్ పై ఒకటిన్నర సంవత్సరంపాటు అధ్యయనం చేశాం. 2,06,668 మందిని శాశ్వత ఉద్యోగులుగా నియమించాం. ఉద్యోగుల సమస్యమలపై ఎప్పుడూ సానుకకూలంగా స్పందించాం. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. 10వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. బాబు హయంలో 54 ఉద్యోగుల సంస్థలు మూసేశారు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News