విజయవాడ: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బుధవారం ఎన్నికల ప్రచారం నుంచి కాస్త విరామం తీసుకున్నారు. ముఖ్య నేతలతో పార్టీ విజయావకాశాలపై సమీక్షించారు. ఆయన మళ్లీ నేడు(గురువారం) ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. ముఖ్యంగా కర్నూల్ నగరం, కళ్యాణదుర్గం, రాజంపేట్ లలో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. వైఎస్ఆర్సి ప్రధాన కార్యదర్శి థలసిలా రఘురామ్ గురువారం జగన్ మూడు చోట్ల ప్రచారం చేస్తారని అన్నారు.
ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పార్టీ గెలుపు అవకాశాలపై సమీక్ష జరిపారు. ప్రచారాన్ని ముమ్మరం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.
2019లో చేసిన వాగ్దానాలు 99 శాతం మేరకు నెరవేర్చామని, కేవలం వైఎస్ఆర్సి పార్టీ మాత్రమే ధైర్యంగా మేనిఫెస్టోను అమలులోకి తెస్తున్నదని జగన్ అన్నారు. ఆయన వైఎస్ఆర్ సి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో గురించి ప్రస్థావిస్తూ ఈ వివరాలు తెలిపారు.