అమరావతి: దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని సిఎం జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సిఎం జగన్ పర్యటిస్తున్నారు. జగనన్న కాలనీలో జరిగే సామూహిక గృహప్రవేశాల్లో సిఎం పాల్గొన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు కొత్త బట్టలు పెట్టి జగన్ ఆశీర్వదించారు. జగనన్న కాలనీలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని సిఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. దత్తపుత్రుడికి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని, వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్‌కు భీమవరం, గాజువాకతో సంబంధం లేదని, అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకు ప్యాకేజీ స్టార్ పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే ఓ వ్యాపారి జనసేన అధినేత పవన్ అని సిఎం జగన్ విమర్శించారు. మన మట్టి, మన వ్యక్తులతో అనుబంధం లేని వ్యక్తులు పవన్ అని ధ్వజమెత్తారు. నా ఎస్‌సిలు, నా ఎస్‌టిలు, నా బిసిలు కూడా అనలేరని చురకలంటించారు.
దత్తపుత్రుడికి ఇల్లాలు మూడు నాలుగేళ్లకు మారుతుంది: జగన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -