Friday, December 20, 2024

బిఆర్ఎస్ వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎపికి చెందిన పలువురు కీలక నేతలు తెలంగాణ భవన్‌లో కెసిఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.అదే విధంగా బిఆర్ఎస్ ఎపి రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ సీఎం కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు. అనుకున్నట్లుగానే ఎపికి చెందిన మాజీ ఐఎఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఎపిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లోను బిఆర్ఎస్ పోటి చేస్తుందన్నారు.

కొన్ని పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడిపేస్తున్నారని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మతపిచ్చి సృష్టిస్తే దేశం ఏమవుతుందని ప్రశ్నించారు. దేశంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై కెసిఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌ వేదికగా హామీలు కురిపించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. బిఆర్ఎస్ వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారవుతుందన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏటా 2.5 లక్షల కోట్లతో 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తామన్నారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మినా.. మళ్లీ బిఆర్ఎస్ తిరిగి తీసుకుంటుందన్నారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News