Sunday, December 22, 2024

కెసిఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ ఇదే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వేజ్ లాస్‌ను భర్తీ చేయడమే కెసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్‌పై సిఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కిట్ అంటే నాలుగు సబ్బులు.. మూడు వస్తువులు కాదు అని స్పష్టం చేశారు. గర్భిణీ మహిళలు వేతనం నష్టపోకుండా(వేజ్ లాస్)ను భర్తీ చేయడమే కెసీఆర్ కిట్ వెనుకాల ఉన్న ఫిలాసఫీ అని కెసిఆర్ వివరించారు. నీతి ఆయోగ్ ఇచ్చే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇండికేటర్స్‌లో 2014లో మన ర్యాంకు 11వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి ఎదిగామని తెలిపారు.

ఒకప్పుడు పేద ప్రజలు ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవారని, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీతో, అనవసరమైన ఆపరేషన్లు చేసేవారని అన్నారు. దీనిని సమాజం నుంచి ఎలా బయటపడేయాలనే ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళిక బద్దంగా కెసిఆర్ కిట్ ప్రారంభించుకున్నామని చెప్పారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులు చేస్తుంటారు.

అది తల్లి ఆరోగ్యానికి కానీ, శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదని, దాన్ని నివారించేందుకు, వారు కూలీకి వెళ్లే డబ్బులను భర్తీ చేసేందుకు మానవీయ కోణంలో తీసుకొచ్చిందే కెసిఆర్ కిట్ అని స్పష్టం చేశారు. అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణిలను ఆస్పత్రులకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నామని… డెలివరీ తర్వాత తల్లీబిడ్డలను వారిని ఇంటికి తరలిస్తున్నామని చెప్పారు. ఇలాంటి సౌకర్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ఈ పథకాల వల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలు రక్షించబడ్డారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News