హైదరాబాద్: ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచే వ్యక్తిని బట్టే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తి వెనకాల ఉన్న పార్టీ చరిత్రను పరిశీలించి ఓటు వేయాలి’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ హితవు చెప్పారు. ధర్మపురి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగు గంటలూ కరెంటు ఇచ్చే రాష్ట్రం దేశం మొత్తం మీద తెలంగాణయేనన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక రైతుల భూములు సురక్షితంగా ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నాయకులు ధరణిని తీసేయాలంటున్నారనీ, ధరణిని తీసేస్తే రైతు బంధు, రుణమాఫీ ఎలా జరుగుతాయని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని, అన్ని రంగాలనూ ప్రైవేటీకరించాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని తనకు ప్రధాని సలహా ఇచ్చారనీ, అయితే తను పెట్టనని ఖరాఖండీగా చెప్పానని కేసీఆర్ అన్నారు.
ధరణితో రైతుల భూములు సేఫ్: కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -