Monday, January 20, 2025

ఆలోచిస్తే నాకు భయం వేస్తోంది: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్ర: నాగ్ పూర్ లో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం ప్రారంభించారు. ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తోందన్నారు. ఈ విషయం ఆలోచిస్తే భయం వేస్తోందని వాపోయారు. జనాభా విషయంలో మనం చైనాను కూడా దాటేశామని, దేశంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: అభివృద్ధి,సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్

ఎన్నికల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందని కెసిఆర్ విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ నేతలు కాదు.. జనం గెలవాలన్నారు. ఎన్నికల్లో జనం గెలిస్తే సమాజమే మారుతోందన్నారు. జనం చంద్రుడు, నక్షత్రాలు కోరట్లేదు.. నీళ్లు ఇవ్వమని కోరుతున్నారని ఆయన వెల్లడించారు. ఔరంగాబాద్ లో 8 రోజులకు ఒకసారి తాగునీరు వస్తోందని చెప్పారు. భారత దేశానికి ఏమైనా లక్ష్యం ఉందా? అని సిఎం ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News