Wednesday, January 22, 2025

రేపు ముంపు ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

- Advertisement -
- Advertisement -

CM KCR Aerial Survey in Flood Affected Areas

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో చోటుచేసుకున్న ప్రకృత్తి విపత్తు, తద్వారా గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (ఆదివారం) ఉదయం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. సిఎం ఏరియల్ సర్వే కడెం నుంచి భధ్రాచలం వరకున్న గోదావరి పరీవాహక ప్రాంతంలో కొనసాగనున్నది. ఈ సర్వేలో సిఎంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు… సిఎం చేపట్టే ఏరియల్ సర్వే కు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధి విధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి రూట్ ను ఫైనల్ చేయనున్నది. అదే సందర్భంలో… ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా, వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ సమీక్షాసమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రేపటి సిఎం పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ పై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News