Monday, January 20, 2025

క్షణక్షణం పర్యవేక్షణ

- Advertisement -
- Advertisement -

CM KCR Alert Ministers and Officials Over Rains

మంత్రులు, ఎంఎల్‌ఎలు, నేతలు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు
ప్రాజెక్టులు, వరద పరిస్థితిపై ఆరా ప్రాణనష్టం జరగకుండా చూడాలని దిశానిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ఉగ్రప్రళయంగా మారిన ముంపు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని, మంత్రులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పరుగులు తీయిస్తున్నారు. వారి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. గంట గంటకు జిల్లాల్లోని వరదల ఉధృతిని స్యయంగా అడిగి తెలుసుకుంటున్నా రు. ప్రగతి భవన్ నుంచే సిఎం కెసిఆర్ వరదలపై తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. వరద ప్రళయాన్ని అంచనా క్షవేస్తూ అధికారాలకు తగు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరదలు విలయం తాండవం చేస్తున్నప్పటికీ పెద్దఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా నివారించడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ముఖ్యంగా వరదల్లో చిక్కుకుని ఒక్క ప్రాణానికి కూడా నష్టం వాటిల్లరాదని సి ఎం కెసిఆర్ చాలా స్పష్టంగాఆదేశాలు జారీ చేశారు. దీంతో పలు జిల్లాల్లో ఉ న్నతాధికారులతో పాటు మంత్రులు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులంతా వరద బాధితులతోనే ఉంటున్నారు. వారి యోగ క్షేమాలకు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా వరద సహాయక చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా సాగుతున్నాయన్న విషయాలను తెలుసుకుంటున్న సిఎం కెసిఆర్ గురువారం కూడా పలువురు మంత్రులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఆయా జిలాల్లో నెలకొన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వరధ ఉధృతి కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటీ? ముంపు ప్రాంతాల ప్రజలను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించారా? లేదా? వారికి అక్కడ అన్ని విధాల సౌకర్యాలు కల్పించారా? తదితర అంశాలపై కూడా కెసిఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కావాలి? ఏది కావాలన్నా అగమేఘాలపై నిర్ణయాలను తీసుకోవాలని కెసిఆర్ సూచిస్తున్నారు. వరద ఉధృతి తగ్గనంత వరకు బాధితులకు ఎలాంటి లోటు రానివ్వ వద్దని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో మంత్రులు, సంబంధిత అధికారులు కూడా బాధితులకు ఎటువంటి సమస్య రానీయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో పలు ప్రాజెక్టులు ప్రళయాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో….ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను కూడా సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకుంటున్నారు. ప్రమాదపు అంచున ఉన్న గ్రామాల వెళ్ళి అక్కడి ప్రజలకు ప్రభుత్వ పక్షాన భరోసా ఇవ్వాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా మంత్రులు, అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటున్నారు. వర్షాలకు తడస్తూ….బాధితులకు భరోసా ఇస్తున్నారు. ప్రధానంగా కడెం ప్రాజెక్టు మహోగ్రరూపం దాల్చడంతో నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం రాత్రి నుంచి అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
మంత్రి ఇంద్రకరణ్‌కు సిఎం ఫోన్
ఈ నేపథ్యంలో గురువారం సిఎం కెసిఆర్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేశారు. కడెం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర సమాచారం సేకరించి తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చని నేపథ్యంలో ముంపుకు గురయ్యే గ్రామాలను ప్రజలను ముందస్తూగానే హెచ్చరికలు జారీ చేసి వారి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైతే హెలికాప్టర్ల సేవలను కూడా వినియోగించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి సూచించారు. అలాగే భద్రాచలంలో గోదావరి క్షణక్షణం ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా గత మూడు రోజుల్లో అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సిఎం కెసిఆర్‌కు వివరిస్తున్నారు. కాగా గోదావరికి గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయానికి 18 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఫలితంగా భద్రాద్రి చుట్టుపక్కల ప్రాంతాలైన కూనవరం, దుమ్ముగూడెం, తాలిపేరు, చర్ల వంటి ఏజెన్సీ ప్రాంతాలు ఎప్పుడు…ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందో తెలియక గజగజ వణికిపోయారు. కాగా మంత్రి పువ్వాడ సంబంధిత అధికారులతో కలిసి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ప్రజలకు ఆస్తినష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు యత్నించారు. దీంతో పలు గ్రామాలు వరద ముంపులో కూరుకపోయినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. కాగా పువ్వాడ అజయ్ పనితీరు పట్ల సిఎం కెసిఆర్ పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. మరో ఒకటి, రెండు రోజులు కూడా ఇలాంటి పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రికి, జిల్లా అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులతో ఫోన్‌లో చర్చలు జరిపారు. బాధితులను వదిలి ఒక గంట కూడా అక్కడి నుంచి ఎటువెళ్ల వద్దని మంత్రులకు సిఎం మరోసారి స్పష్టంగా సూచించారు. దీంతో మంత్రులంతా ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టులు, బాధితులను అంటిపెట్టుకుని పహారా కాస్తున్నారు.
కరీంనగర్‌లో తొమ్మిది ప్రాణాలను కాపాడిన రెస్కూటీం
కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వాగులో చిక్కుకున్న ఒడిశాకు చెందిన 9 మంది ఇటుక బట్టి కార్మికులు సురక్షింతంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే జిల్లా మంత్రి గంగుల కమలాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

CM KCR Alert Ministers and Officials Over Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News