Monday, December 23, 2024

సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: రజకుల అభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు భూంపల్లి శ్రీహరి అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని లాల్ కమాన్ వద్ద సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తి చేసుకునే రజకులకు ఉచిత కరెంట్, లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులు దోబీసేవల టెండర్ అవకాశం రజకులకు మాత్రమే కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. రజకుల అభున్నతికి నిరంతరం పాటు పడి పని చేస్తున్న సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల వెంటే తామంతా అన్ని వేళలా ఉంటామని తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News