Monday, December 23, 2024

సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట రూరల్: కుమ్మరి వృత్తికి సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావులు అండగా నిలుస్తున్నారని సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు దరిపల్లి శ్రీను అన్నారు. ఆదివారం కుమ్మరి మోడల్ ప్రాజెక్ట్‌కు రూ. 2 కోట్ల 20 లక్షలు కేటాయించినందుకు అంబేద్కర్ సర్కిల్ వద్ద సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావుల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏళ్ల సమైక్య పాలనలో కుమ్మరి వృత్తిని ఆదుకునే చర్యలు చేపట్టలేదన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోనే కులవృత్తులు మళ్లీ పునర్జీవనం పోసుకుంటున్నాయని తెలిపారు. అంతరించిపోతున్న దశలో కుమ్మరి వృత్తిని సర్కార్ ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు వల్లతత 800 కుటుంబాల్లో వెలుగులు నిండుతాయని హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News