Monday, December 23, 2024

సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి చిత్రపటాలకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కట్టంగూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ నగర్ కాలనీకి మరియు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బజారు నుండి అంబటివాగుకు వెళ్లే రోడ్లపై తెగిపోయిన పాత కల్వర్టుల స్థానంలో నూతన బ్రిడ్జిల ఏర్పాటుకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కృషి తో ఎస్‌డిఎఫ్ నిధుల కింద రూ. 4 కోట్ల రూపాయల మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దవాగు వద్ద సిఎం కెసిఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల చిత్రపటాలకు జడ్పీటిసి తరాల బలరాములు, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు స్థానిక బిఆర్‌ఎస్ శ్రేణులు, కాలనీవాసులతో కలిసి శుక్రవారం వారు క్షీరాభిషేకం చేశారు.

ఈసందర్భంగా జడ్పీటిసి తరాల బలరాములు, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం పెద్దవాగు పై ఉన్న కల్వర్టులు భారీవర్షాల కారణంగా తెగిపోవడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వారు తెలిపారు. దీంతో స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చిరుమర్తి తక్షణమే స్పందించి బ్రిడ్జిల నిర్మాణం కోసం మంత్రులు జగదీష్‌రెడ్డి, కెటిఆర్ ల సహకారంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరగా, సిఎం కెసిఆర్ వెంటనే స్పందించి రెండు బ్రిడ్జిల నిర్మాణం కోసం ఎస్‌డిఎఫ్ నిధుల కింద రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని వారు వెల్లడించారు.

నూతన బ్రిడ్జిల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, బిఆర్‌ఎస్ శ్రేణులు, కాలనీవాసులు సిఎం కెసిఆర్ కు, మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వారు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పోగుల నర్సింహ్మ, పట్టణ అధ్యక్షులు చెవుగోని జనార్ధన్, బిఆర్‌ఎస్ మండల నాయకు లు పెద్ది బాలనర్సింహ్మ గౌడ్, మేకల జనార్ధన్, మేకల రమేష్, పిఏసిఎస్ డైరెక్టర్ నమ్ముల సత్యనారాయణ, ఆర్‌ఎస్‌ఎస్ డైరెక్టర్ మేడి వెంకన్న, వార్డు సభ్యులు పొడిచేటి సైదులు, రెడ్డిపల్లి మనోహర్, అంతటి శ్రీను, మునుగోటి ఉత్తరయ్య, నాయకులు, కాలనీవాసులు మాతంగి యాదయ్య, పులిగిల్ల వెంకన్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News