Monday, December 23, 2024

చలో పండరీపురం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 27వ తేదీన తమ మంత్రి మండలితో కలిసి మహారాష్ట్రలోని ప్రఖ్యాతమైన పండరీపురం సందర్శనకు వెళ్లుతారు. ఈ నెల 29వ తేదీన ఆషాఢ ఏకాదశికి రెండు రోజుల ముందు ఆయన షోలాపూర్ జిల్లాలో ఇక్కడ నెలవై ఉన్న శ్రీ విఠల్ రుక్మిణీ మందిరంలో పూజాదికాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు పండరీపురం వరకూ పాదయాత్రగా వెళ్లివస్తుంటారు. పాండురంగ విఠలన్న, సతీ సక్కుబాయి అన్న తెలంగాణ మారుమూల పల్లెల్లో చెక్కుచెదరని ఆదరణీయ భావం ఉంది.

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తమ కేబినెట్‌తో పండరీపూర్‌కు వస్తున్నారని , పూజలు నిర్వహిస్తారని, సంత్ తుకారాం, సంత్ ధ్యానేశ్వర్‌ల స్మారక మందిరాలకు పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పిస్తారని బిఆర్‌ఎస్ మహారాష్ట్ర ఇన్‌చార్జి , మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగ్డే తెలిపారు. తెలంగాణ పల్లెల నుంచి పెద్ద ఎత్తున జనం కాలినడకన భక్తిశ్రద్ధలతో మహారాష్ట్రకు తరలివస్తారని, వీరికోసం అక్కడక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని అన్నా వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News