హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను 10 రోజుల్లో విడుదల చేస్తామన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో కొత్తగా నిర్మించిన గిరిజన, బంజారా భవన్‌లను ప్రారంభించిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న దళిత బంధు మాదిరిగానే గిరిజనబంధును త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామన్నారు. భూములు లేని గిరిజనులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. గిరిజన బంధు ద్వారా రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. సంపద పెంచడం పేదలకు పంచడమే తమ సిద్ధాంతం అని సిఎం పేర్కొన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి మొర పెట్టుకుని విసిగి వేసారిపోయామని సిఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజన బంధు పథకం అమలు చేస్తాం: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -