- Advertisement -
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై సిఎం కెసిఆర్ సంతకం చేశారు. ఏకగ్రీవ తీర్మానాన్ని సిఎం చదివి వినిపించారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పార్టీ పేరు మార్పుపై సిఎం కెసిఆర్ ఇసికి లేఖ రాశారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలిపారు.
- Advertisement -