హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80వేల 39 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతి పైన పని చేస్తున్న 11వేల 103మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అన్ని కేటగిరిలో గరిష్ఠ వయస్సును 10 సంవత్సరాలకు పెంచుతున్నట్లు సిఎం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరురి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
CM KCR Announces 80039 Govt Vacancies