Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ వరాల జల్లు.. కొండగట్టు అంజన్నకు రూ.100 కోట్లు

- Advertisement -
- Advertisement -

కొండగట్టు అంజన్నకు సిఎం కెసిఆర్ వరాల జల్లు ప్రకటించారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోవడమే కాదు ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామన్నారు. జగిత్యాల జిల్లా అవుతుందని కళలో కూడా ఎవరు అనుకోలేగన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైందన్నారు. అలాగే జగితాల, కరీంనగర్ జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి రూ. 10 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.

ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన, అద్భుతమైన నరసింహాస్వామి ధర్మపురికి వచ్చానని అన్నారు. ఆ రోజు ఒక మాట చెప్పానని…. గోదావరి నది తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని ఉమ్మడి రాష్ట్రంలో సింహాంలా గర్జించానని కెసిఆర్ గుర్తు చేశారు. దాని మీద చాలా రకాలుగా మాట్లాడారన్నారు. మళ్లీ పుష్కరాలు వచ్చేలోగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే, ఇక్కడే పుష్కరాలు జరుపుదామని మొక్కానని అన్నారు. నిండు మనసుతో మొక్కానని పేర్కొన్నారు. ధర్మపత్ని సమేతంగా వచ్చి తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామి వారిని దర్శించుకున్నాను.

పండితులు తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవెన ఇచ్చారన్నారు. స్వామి వారి దయ, వేదపండితుల ఆశీస్సులతో తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్కరాలు జరుపుకున్నామన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతమన్నారు. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారన్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేదన్నారు.

ఈ నేపథ్యంలో 384 ఎకరాల స్థలాన్ని దేవాలయానికి ఇచ్చామన్నారు. 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉందన్నారు. అందువల్లే. కొండగట్టు అంజన్న క్షేత్రం అభివృద్ధికి వంద కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే తానే స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం, భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తానని కెసిఆర్ హామి ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News