భద్రాద్రి : ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యుడిగా, భద్రాద్రి జిల్లాకి ఒక కుటుంబసభ్యుడిగా వరద బాధితులను ఆదుకునేందుకు శక్తి వంచన లేకుండా తాపత్రయ పడుతున్నాడని సిఎం కెసిఆర్ అన్నారు. భవిష్యత్తులో ఎటువంటి విపత్తులు వచ్చినా అధికమించేలా వరద ముప్ప ప్రాంత ప్రజలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడమే అంతిమ పరిష్కారమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఎం కేసీఆర్ ను కోరారు. భద్రాద్రి జిల్లా ప్రజలకు భవిష్యత్తులో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారం దిశగా కాలనీ నివాసాలు ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ చెప్పారు. ఎత్తైన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించాలని పువ్వాడను ఆదేశించారు. వెయ్యి కోట్లతో కాలనీలు నిర్మాణం చేపట్టాలన్నారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరుతున్నారు, అందుకని వరద బాధిత కుటుంబాలకు రూ. 10000 ఆర్ధిక సహాయం చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. వరద వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.