Monday, December 23, 2024

రాబోయే ఒలింపిక్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించాలి

- Advertisement -
- Advertisement -

రాబోయే ఒలింపిక్స్‌లో నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష
నిఖత్ జరీన్ ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం
శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులకు రూ.2 ప్రకటించిన సిఎం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికలమీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టిను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్‌కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సిఎం స్పష్టం చేశారు. సచివాలయంలో గురువారం నాడు సిఎం కెసిఆర్‌తో నిఖత్ జరీన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సిఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం గాను రూ.2 కోట్లను సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. సిఎంను కలిసిన వారిలో క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎంఎల్‌సి మధుసూధనాచారి, ఎంఎల్‌ఎలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సిఎంఒ కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఈడిగ ఆంజనేయ గౌడ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News