Tuesday, December 24, 2024

మత మౌఢ్యమే ముప్పు

- Advertisement -
- Advertisement -

మౌఢ్యం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది

మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడే 
ఆలయం సామాజిక సాంత్వన కేంద్రం, హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర అద్భుతం 
ధనవంతులు రూ.5 భోజనం తింటున్నారు

ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు నడుస్తాయి

కోకాపేటలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లు అందివ్వనున్నట్లు ప్రకటన

మతమౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఇది మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మతం పేరుతో జరిగే దుష్ప్రచారాన్ని హరేకృష్ణ సంస్థ అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు. హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవామండలి విరాళంతో నిర్మిస్తున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు. కోకాపేటలోని హరేకృష్ణ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 400 అడుగుల ఎత్తైన హరేకృష్ణ హెరిటేజ్ టవర్(ఆలయం) నిర్మాణానికి సంబంధించి సిఎం శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టవర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం కెసిఆర్ మాట్లాడుతూ ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణంలో మీ మధ్య ఉన్నందు కు సంతోషంగా ఉందన్నారు. మనుషులు, ప్రాంతాలు, దేశాలు వేరైనా పూజించే పరమాత్ముడు ఒక్కడేనని ఆయన చెప్పారు. ఆలయం సామాజిక సాంత్వన కేంద్రమని ఆ యన వెల్లడించారు.

కరోనా సమయంలో సేవలు అద్భుతం
హరేకృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చే యడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపా రు. హైదరాబాద్‌లో ధనవంతులు కూడా రూ.5 భోజనం తింటున్నారన్నారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అక్షయపాత్ర లాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు. కరోనా సమయంలో హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించిందని కెసిఆర్ కొనియాడారు. అన్ని ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలిచింద న్నారు. హైదరాబాద్ వేగంగా అ భివృద్ధి చెందుతుందని, నగరంలో హరేకృష్ణ ఆలయం ని ర్మించడం మంచి పరిణామని కెసిఆర్ చెప్పారు. విశ్వ శాం తి కోసం మనం ప్రార్థన చేయాలని సిఎం సూచించారు. మనశ్శాంతి కోసం ప్రస్తుతం చాలామంది మ్యూజిక్ థెరపీ తీసుకుంటున్నా రన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించామని, వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

త్వరలోనే ఆధ్యాత్మిక కేంద్రం
హైదరాబాద్‌లో అతి త్వరలోనే అందమైన ఆధ్యాత్మిక కేం ద్రం రాబోతుందని కెసిఆర్ పేర్కొన్నారు. శాంతియుతమైన సమాజ స్థాపనే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సామాజిక, ఆధ్యాత్మిక దారిలో ప్రజలకు తమవంతు సహకారం అందిస్తున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మనిషి ఏదైనా విజయం సాధిస్తే తన ప్రతిభగా చెప్పుకుంటారని, విపత్తు వస్తే మాత్రం దేవుడిపై నెపం వేస్తాడని ఆయన తెలిపారు. దేశం, భాష, భావం, ఆహారం వేరైనా భగవంతుడి ఆరాధన ఒక్కటేనని కెసిఆర్ స్పష్టం చేశారు. రూ.200 కోట్లతో నిర్మించే హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కాకతీయ, చాళుక్య, ద్రవిడ చక్రవర్తుల కాలం నాటి కట్టడాల శైలిని పోలి ఉండనుంది. ఈ భూమి పూజ కార్యక్రమంలో సిఎం కెసిఆర్‌తో పాటు ఎంపి సంతోష్‌కుమార్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ వాణీ దేవి, హరేకృష్ణ మూమెంట్ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News