Wednesday, April 23, 2025

ముంబై చేరుకున్న సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

CM KCR arrives in Mumbai

ముంబై: ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముంబయికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే నివాసానికి చేరుకోనున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు సిఎంలు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్‌ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలపై చర్చించనున్నారు. తర్వాత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలువనున్నారు సిఎం కెసిఆర్. సాయంత్రం 7.20 గంటలకు ముంబై నుంచి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సిఎం వెంట ఎంపిలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News