- Advertisement -
- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు: ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం కెసిఆర్ వికలాంగులకు పెద్ద భరోసా కల్పించారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ఓ ప్రకటనలో దివ్యాగులకు రూ. 1016 ఫెక్షన్ కల్పిచడంపై కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రావడంతో దివ్యాంగుల కళ్లలో ఆనందం కలిగిందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు రు.400ల పింఛన్ 4016 పెంచిన ఘనత కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటికే దివ్యాంగులకు రూ. మూడు కోట్లతో 300 మంది వికలాంగులకు స్కూటీలు అందజేయడం జరిగిందన్నారు. వికలాంగులను ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని చెప్పారు.
- Advertisement -