Wednesday, January 22, 2025

ఉద్యోగుల పక్షపాతి సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR Birth Day Celebrations

మన తెలంగాణ,సిటీబ్యూరో: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు టిఆర్‌ఎస్వీ గుర్తింపు యూనియన్ వాటర్‌వర్క్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ ఆధ్వర్యంలో బోర్డు ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించింది. దాదాపు 350 మందితో కార్యక్రమం నిర్వహించినట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ కార్మిక ఉద్యోగుల పక్షపాతి అని వాటర్ వర్క్ ఉద్యోగులకు చిరకాల కోరిక హెల్త్ కార్డు ఇవ్వడమే కాకుండా పిఆర్సీ బకాయిలు ఒకేసారి ఇచ్చారని, ఉద్యోగ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచడమే కాకుండా అనేక రకాలుగా వాటర్ బోర్డు కార్మికులను ఆదుకున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News