Wednesday, January 22, 2025

మౌలాలి స్కూళ్లో కెసిఆర్ బర్త్ డే…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అపర భగీరథుడు, కాళేశ్వర సృష్టికర్త, అభివృద్ధి ప్రధాత, ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో మౌలాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో కేక్ కట్ చేసి, మొక్కలను నాటడం జరిగింది. ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ పల్లా ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మాచారి, టిఆర్ఎస్ వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీష్, నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ జిల్లా శంకర్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆడేపు సురేష్ కుమార్, ఒయు పిహెచ్ డి స్కాలర్ పరశురామ్, రాజలింగం, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News