Thursday, January 23, 2025

అపర భగీరథుడు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ప్రజలు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. సిద్దిపేట సిగలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడు, తెలంగాణ ప్రజలకు స్వేఛ్చా వాయువులు ప్రసాదించిన శేఖరుడు, కాళేశ్వర గంగను దివి నుంచి భువికి దించిన అపర భగీరథుడు, తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చిన రైతుబాంధవుడు, అద్భుత పాలనతో దేశాన్ని ఆలోచింపచేస్తున్న అనితరసాధ్యుడు, సిఎం కెసిఆర్ అంటే కారణ జన్ముడుగా… చిరస్మరణీయుడుగా ప్రజల తల రాతలను మార్చే మహనీయుడుగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు మంత్రి హరీష్ రావు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన ఫేస్ బుక్ ఖాతాలో సిఎం కెసిఆర్ కు హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News