Sunday, December 22, 2024

జలమండలిలో ఘనంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

CM KCR Birthday Celebrations at Jalamandali

హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జలమండలి శాఖ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేయడంతో పాటు సుమారు 250 మంది జలమండలి సిబ్బంది, కార్మికులకు ఐదు రకాల పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా టీజీవో నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయుడు కెసిఆర్ అని అన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్దిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రూపుదిద్దుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇంటింటికి తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని నెరవేర్చిన సీఎం కెసిఆర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందిస్తూ మరింత మేలు చేస్తున్నారని వెల్లడించారు. కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యోగలోకమంతా కష్టపడి పనిచేస్తోందన్నారు. టీజీవో హైదరాబాద్ జిల్లా కోశాధికారి అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి టీజీవో అధ్యక్షులు మన్నెబోయిన కృష్ణయాదవ్, కార్యదర్శి టి. హరికృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనీష్, జలమండలి శాఖ కార్యదర్శి చంద్రజ్యోతి, ఉపాధ్యక్షురాలు బి. స్వరూపం, ఈసీ మెంబర్ పూనమ్, కార్యనిర్వహక కార్యదర్శి గోపిచంద్, జలమండలి శాఖ అసోసియేట్ ప్రెసిడెంట్ సంతోష్‌కుమార్, సోషల్ వర్కర్ ఏవీరావు, టీఎన్‌జీవో అధ్యక్షులు మహేష్ కుమార్‌తో పాటు ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News