Monday, December 23, 2024

రాష్ట్రాన్ని అన్ని విధాల ముందంజలో తీసుకొచ్చిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ఎంతో ముందంజలోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బిలీవరీ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి నిరుపేదల పట్ల కరుణ చూపే దేవుడు ఆయన బోధనలు అనుసరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. పథకాలు అందరికీ పూర్తిస్థాయిలో అందేలా చూడాలని కోరుతూ సిఎం కెసిఆర్ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాల ఎంతో ముందంజలోకి తీసుకొచ్చారన్నారు.

అన్ని మతాలను సమానంగా చూస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్రైస్తవులకు ఉన్న సమస్యలను అందుబాటులో ఉండి పరిష్కరిస్తున్నారు. క్రిస్టియన్ భవనం మంజూరు చేశారన్నారు. నర్సంపేట డివిజన్‌లో ఉన్న ఫాస్టర్ల అందరి పక్షాన చర్చిల్లో ప్రార్థన కూడికలో పాలు పంచుకున్నటువంటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. మళ్లీ సిఎం కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యే కావాలని ఫాస్టర్లందరూ ప్రార్థన చేస్తున్నామన్నారు. యేసుప్రభు దీవెన నాకు కావాలని తెలంగాణ రాష్ట్రానికి సిఎం కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రార్థన చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్, ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, కౌన్సిలర్లు గందె రజిత, శ్రీదేవి, కోఆప్షన్ పరికి జ్యోతి ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్, టౌన్ సీఐ పులి రమేశ్, మైనార్టీ అధికారులు, నర్సంపేట డివిజన్ షాలోమ్ ఫాస్టర్స్ అధ్యక్షుడు కొమురయ్య, బ్రదర్ ఆదాం బెన్నీ, రేజీ జార్జి, పాస్టర్ శ్రీనివాస్, పాస్టర్ జాన్సన్, పాస్టర్ స్వామి, ఫాస్టర్లు, సేవకురాలు పాల్గొన్నారు.

* సంగెంలో.. తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవాల్లో భాగంగా కుంటపల్లి బ్యూలా చర్చ్‌లో ఎంపీపీ కందగట్ల కళావతి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఎంపీఓ కొమురయ్య, సర్పంచ్ బాబు, కుంటపల్లి సర్పంచ్ కావటి వెంకటయ్య, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు కందకట్ల నరహరి, సంఘ కాపరి డాక్టర్ కె. శామ్యూల్, బీఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పురం శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ జక్క దూడయ్య, మాజీ వైస్ ఎంపీపీ కాగితాల జగన్నదాచారి, కోఆప్షన్ బూసాని మొగిలి, కుంటపల్లి గ్రామ కార్యదర్శి వాజిద్, గోపి, సాంబరాజ్, చర్చి సంఘ పెద్దలు, స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

* గీసుకొండలో.. మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాగా కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఈఓ శేషగిరి, దేవస్థానం ఛైర్మన్ గడ్డమీది కుమారస్వామి, చక్రవర్తుల శ్రీనివాసచార్యులు, ఎలుకుర్తిలో సర్పంచ్ పుండ్రు జయపాల్‌రెడ్డి, మరియపురంలో అల్లం బాలిరెడ్డి, పాంచాల రాయ ఆలయంలో సర్పంచ్ రాజబోయిన రజిత, గంగదేవిపల్లిలో గోనె మల్లారెడ్డి, ఆరెపల్లిలో సర్పంచ్ వాడుకరి జ్యోతి, బోడకుంట్ల ప్రకాష్, అనిల్, దౌడ్ బాబు పాల్గొన్నారు.

* గంగారంలో.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఛైర్మన్ సైపా సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాటాలడుతూ.. ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ఆలయ అర్చకులను ఘనంగా సన్మానించుకోవాలని తెలుపుతూ ఆలయ అర్చకులు సునారి వెంకటేశ్వర్లు, దుర్గం రాములు, కాసుల కృష్ణమాచార్యులను ఆలయ ఛైర్మన్, సర్పంచ్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News